Posted On: October 25th 2026, 04:18 pm
అన్ని ఆలోచనలకు అతీతంగా.....
మనసుని అంతర్ముఖంగా ఉంచుకొని...
ప్రశాంతమైన స్థితిని పొందుతూ ఉంటే...
దేహానికి అతీతంగా ఆత్మ,ఫరిస్తాఅయి పయనిస్తూ ఉంటుంది
ఆ పరమాత్మని సన్నిధికి...
ఆ చైతన్య శక్తి దేహంలో మేల్కొనేటప్పుడు దేహం చాలా తేలిక అయిపోతూ ఉంటుంది...
అతీంద్రియ శక్తులు అప్పుడే మనలో మేల్కొంటాయి..
మెడిటేషన్ లో ఎన్నో అద్భుతమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి...
మనసు అప్పుడు దేహమనే బ్రాంతి నుంచి దూరం అవుతూ ఉంటుంది...
మనసు బుద్ధి సంస్కారాలు దివ్యంగా మారుతూ ఉంటాయి...
ఇటువంటి గొప్ప అనుభూతులు పొందడానికి అప్పటి ఋషులు మునులు, హిమాలయాల్లో ఉండి తపస్సు చేస్తూ ఉండేవారు..
కానీ ... ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ద్వారా.. మేము నేర్చుకున్న రాజయోగం... ఇంట్లోనే ఉంటూ...
ఈ సమాజానికి ,ఈ దేహానికి అతీతంగా అయి అప్పుడప్పుడు విహారం చేసే ఓ గొప్ప అనుభూతి కలుగుతూ ఉంటుంది..
.... ఈ మానవ లోకంలోనే దైవ అనుభూతులు పొందే ఎన్నో దివ్యమైన మెడిటేషన్ ఉన్నాయి..బి కే జయలక్ష్మి
Load More