Posted On: November 4th 2026, 10:27 am
తుఫాను ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలు… రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే పంతం నానాజీ గారు! 🌾
ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నప్పటికీ, తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తన ప్రచార కార్యక్రమాలను పక్కనపెట్టి ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, పంటలకు జరిగిన నష్టాన్ని, పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా కాలువల ద్వారా దిగువకు మళ్లించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.