Posted On: July 22nd 2026, 12:08 am
#మానవసేవే మాధవ సేవ
*అభాగ్యుడి సేవలో స్ఫూర్తి...*
*మానవత్వాన్ని చాటుకున్న స్ఫూర్తి సభ్యులు...*
*డోన్ పట్టణానికి చెందిన స్ఫూర్తి సభ్యులు మరో అభాగ్యుడికి సపర్యలు చేసి ఆసుపత్రిలో చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గత నాలుగు రోజులుగా ఓ వ్యక్తి డోన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై దీన స్థితిలో ఉండటాన్ని గమనించిన స్ఫూర్తి సభ్యులు అతడికి ఆహారం అందించి, సపర్యలు చేశారు. అనంతరం అతడిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతడి వివరాలు సేకరించి తనను సొంత గూటికి చేర్చుతామని, ఎవరు లేరంటే ఒక మంచి ఆశ్రమంలో చేర్పిస్తామని స్ఫూర్తి సభ్యులు తెలిపారు. అనునిత్యం అభాగ్యుల సేవలో సాగుతున్న స్ఫూర్తి సభ్యులను ఆసుపత్రి వైద్య సిబ్బంది, స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, చిట్యాల మహమ్మద్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు...*
*స్ఫూర్తి సేవా సమితి. డోన్*
7989474725